Flash News- తెలంగాణలో ఘరానా మోసగాడు..కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానంటూ..

Gharana cheater in Telangana..contracts now ..

0
87

తెలంగాణలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఏకంగా రూ.కోటి 80 లక్షలు వసూలు చేసుకొని ఉడాయించాడు.

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ మోసం వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లాకు చెందిన నాగేంద్ర కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానంటూ జేసీబీ, ట్రాక్టర్ల యజమానుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు. సుమారు 100 మంది నుంచి రూ.కోటి 80 లక్షలు వసూలు చేసి వారికి కుచ్చుటోపీ పెట్టాడు. మహబూబూబాద్, సమీప గ్రామాల్లో నాగేంద్ర డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తుంది. బాధితులు మహబూబాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.