చిట్టీల పేరుతో ఘరానా మోసం..

0
104

దేశంలో మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా బాపట్ల జిల్లా చిన్న గంజాంలో చిట్టీల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డారు కొందరు నిందితులు. ఈ ఘటనపై ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు  చెప్పడంతో ప్రధాన నిందితుడిగా హరినాథ్ పేరు బయటపడింది.

అంతేకాకుండా నిందితుల వద్ద నుంచి 6 లక్షల నగదు,బంగారం,వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంకా మూడు కోట్ల రూపాయల విలువచేసే దస్తావేజులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెపుతున్నారు. ఈ ఘటనపై ఇంకా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.