కుటుంబంతో సహా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

0
87

కట్టుకున్న భార్య, కన్నబిడ్డలతో సహా ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ లోని లిబర్టీ లో ఉన్న జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముందు ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు, వీడియో లింక్ కింద ఉన్నాయి…

https://www.facebook.com/alltimereport/videos/791537698149191

జిహెచ్ఎంసి ఆబిడ్స్ సర్కిల్ లో 14 ఏళ్లుగా శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ గా రమేష్ యాదవ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఈ రమేష్ యాదవ్ ను మెడికల్ ఆఫీసర్ ఉమ గౌరి ప్రతినెలా డబ్బులు ఇవ్వాలని వేధింపులకు గురిచేసేదని బాధితుడు వాపోయాడు. తాను డబ్బులు ఇవ్వలేని చెప్పడంతో తనను ఉద్యోగంలోంచి తీసేసి, తనను తన కుటుంబాన్ని రోడ్డుమీద పడేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

మెడికల్ ఆఫీసర్ వేధింపులు తాళలేక కుటుంబంతో సహా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చామని చెప్పిన రమేష్ యాదవ్ వెంటనే తనతో తెచ్చుకున్న పెట్రోల్ ను తన మీద కుటుంబసభ్యుల మీద పోశాడు.

దీంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యి వారిని పట్టుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. దీనిపై ఉన్నతాధికారులు ఏరకంగా స్పందిస్తారో చూడాలి.