ఎప్పుడు ఎవరికీ ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. కుటుంబానికి చెందిన ఎవరైనా బయటకు వెళ్తే ఇంటికొచ్చేవరకు క్షేమంగా వస్తారని గ్యారెంటీ లేదు. కానీ కేరళలో జరిగిన ఓ ఘోర ప్రమాదం కుటుంబం మొత్తాన్ని మింగేసింది. కేరళలోని తిరువనంతపురమ్ జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే..దవలపురమ్, వర్కాల సమీపంలోని ఓ ఇంట్లో సోమవారం అర్ధరాత్రి 1.45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 నెలల బాలుడు సహా ఒకే కుటుంబంలో మొత్తం ఐదుగురు సజీవ దహనమయ్యారు. వారు ప్రతాపన్(64), అతని భార్య షెర్లీ(53), చిన్న కుమారుడు అఖిల్(25), పెద్ద కూమారుడి భార్య అభిరామి(24), 8 నెలల కుమారుడు రయాన్ మరణించారు. తీవ్ర గాయాలైన ప్రతాపన్ పెద్ద కుమారుడు నిఖిల్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.