తెలంగాణలో ఘోరం..వివాహిత దారుణ హత్య

Ghoram in Telangana..Married brutal murder

0
124

తెలంగాణలో దారుణ హత్య కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగిన ఈ ఘటన విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అమీన్‌పూర్‌ మండలం జానకంపేటకు చెందిన నాగమణిని నరసింహులు అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆ మహిళ క్షణికమైన సుఖం కోసం తప్పటడుగు వేసింది.

ఈనెల 2న నాగమణి అదృశ్యం అయ్యింది. దీంతో తన భర్త అమీన్‌పూర్‌ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. జిన్నారం మండలం దువ్వగుంటకు చెందిన జంగయ్య అనే వ్యక్తితో నాగమణికి వివాహేతర సంబంధం ఉందని తెలియడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మొదటగా తనకు సంబంధం లేదని చెప్పిన అతను పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నాడు. నాగమణిని తానే చంపినట్లు చెప్పాడు. పటాన్​చెరు మండలం రామేశ్వరం గ్రామ శివారులో హత్య చేసినట్లు తెలిపాడు.