ఘోరం: చపాతీలు చేయనందుకు యువకుడి హత్య

Ghoram: Murder of a young man for not making chapatis

0
135

రోజురోజూకు నేరాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంతో హత్యలు చేసేందుకు వెనకాడడం లేదు. దీనితో నిండు ప్రాణాలు బలై పోతున్నాయి. రోజూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా రాజస్తాన్ లోని జైపూర్‌లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.

చపాతీ చేయలేదన్న కారణంతో ముగ్గురు వ్యక్తులు కలిసి యువకుడిని దారుణంగా గొంతు కోసి చంపారు. వంట విషయంలో నలుగురు కూలీల మధ్య జరిగిన ఈ గొడవ హత్యకు దారి తీసింది. ఆల్వార్ నివాసితులైన సంతోష్ మీనా, లీలా రామ్ మీనా, గంగా లహేరి, హతుడు జై ప్రకాశ్‌ నారాయణ(27) విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికులుగా పని చేస్తున్నారు. వీరంతా ఐస్ ఫ్యాక్టరీకి సమీపంలో ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నారు.

అయితే శుక్రవారం రాత్రి వారి మధ్య వంట విషయంలో గొడవ జరగింది. అయితే చపాతీలు చేయాలని మిగతా ముగ్గురు జై ప్రకాశ్‌నారాయణ్ అనే వ్యక్తిని పురమాయించారు. అయితే.. అతను చపాతీలను చేయనని చెప్పడంతో మిగతా ముగ్గురు అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జై నారాయణ్ బాత్‌రూమ్‌కి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించి.. కొట్టి, గొంతుకోసి చంపేశారు. ఆ తర్వాత ఆ ముగ్గురు బాధితుడిని వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.