తెలంగాణలో ఘోరం..పాపకు కరెంట్ షాకిచ్చి చంపిన తండ్రి

0
101

తెలంగాణలో దారుణం జరిగింది. కన్న తండ్రే కసాయిగా మారి బిడ్డ ప్రాణాలను తీసేశాడు. సిద్ధిపేట జిల్లా వెంకటరావుపేటకు చెందిన రాజశేఖర్, సునీత దంపతులకు 11 నెలల పాప ఉంది. వీరిద్దరికి తరచూ గొడవలు జరిగేవి. వేరే కాపురం పెడదామంటూ భార్య చెప్పగా దానికి భర్త ఒప్పుకోలేదు. ఇదే విషయమై ఇవాళ మళ్లీ గొడవ జరిగింది. కోపంతో రాజశేఖర్ భార్యను కొట్టి పాపను పొలం దగ్గరకు ఎత్తుకెళ్లాడు.

అక్కడే ఉన్న బావి దగ్గర పాపకు కరెంటు షాక్ ఇచ్చి హత మార్చాడు. అనంతరం అతను పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.