Breaking News- ఘోరం..మహిళా రైతులపైకి దూసుకెళ్లిన ట్రక్కు

Ghoram..truck that crashed into women farmers

0
62

హరియాణాలో దారుణం జరిగింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న మహిళా రైతులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఘటన సమయంలో వీరంతా ఆటో కోసం ఎదురుచూస్తూ డివైడర్​పై కూర్చున్నారని పోలీసులు తెలిపారు. హరియాణా బహాదుర్​గఢ్​లో గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మహిళా రైతులు ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళా రైతు గాయపడ్డారు. కాలికి తీవ్ర గాయం అయిన ఆమెను రోహ్​తక్​లోని పీజీఐ ఆస్పత్రికి తరలించారు.