బ్రేకింగ్- ఎయిర్ గన్ తో పిల్లల ఆటలు..అంతలోనే విషాదం

0
86

తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలోని ఓ ఫామ్ హౌస్ లో ఎయిర్ గన్ పేలి బాలిక మృతి చెందింది. స్థానికులు బాలిక మృహాదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పిల్లలు ఎయిర్ గన్ తో ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.