ప్రియుడిపై పగ తీర్చుకున్న ప్రియురాలు – ఇంత కసిగా ఉంటారా ?

Girlfriend taking revenge on boyfriend

0
104

వారిద్దరూ ప్రేమించుకున్నారు. కొంత కాలం తర్వాత విడిపోయారు. ఇక ప్రియుడు ఆమె నుంచి దూరం అవ్వడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. మాజీ ప్రియుడిపై పగ, ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్లు రచించింది. మరి ఆమె ఏం చేసిందో చూద్దాం. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లోని లావ్, కియాన్ కొంతకాలం క్రితం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వారిద్దరు విడిపోయారు.

ఈ క్రమంలో లావ్ మాజీ ప్రియుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ప్రణాళిక రచించింది.అతని స్నేహితుడి ద్వారా కారుని అద్దెకు తీసుకుంది. చివరకు ఆకారు తీసుకుని రాష్ డ్రైవ్ చేసింది, అంతేకాదు దాదాపు 50 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించింది. చివరకు ఇన్ని ఫైన్లు పడటంతో అతను జైలుకు వెళతాడు అనుకుంది.

రెండు రోజుల్లోనే 50 సార్లు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ కారును గుర్తించారు. ఈ కారు ఈ సమయంలో నా దగ్గర లేదు. నా ఫ్రెండ్ తీసుకున్నాడు అన్నాడు కియాన్. ఆ ఫ్రెండ్ ని అడిగితే ఈ కారు ఆ అమ్మాయి తీసుకుంది అన్నాడు. ఆమె దగ్గరకు వెళితే అసలు విషయం చెప్పింది. ఆ యువతిని అరెస్ట్ చేసి విచారణ చేపడితే అన్ని విషయాలు చెప్పింది.