ప్రియుడితో పారిపోయిన ప్రేయసి – ఇంటికి వచ్చిన తర్వాత ఆమె అన్న ఏం చేశాడంటే

Girlfriend who ran away with boyfriend-That’s what her older brother did after coming home

0
118

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లా చుర్ గ్రామంలో దారుణమైన ఘటన జరిగింది. 16 ఏళ్ల అంజలి అనే బాలిక గౌరవ్ అనే యువకుడిని ప్రేమించింది. ఇటీవల ఆమె ప్రియుడితో పారిపోయింది, వెంటనే అలర్ట్ అయిన పేరెంట్స్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగొచ్చింది. ఆమె వల్ల తమ పరువు పోయిందని అప్పటికే ఆగ్రహంగా ఉన్న ఆమె సోదరుడు శేఖర్ ఆ కోపం ఆమె పై చూపించాడు.

ప్రియుడితో పారిపోయిన బాలికను అన్న కాల్చి చంపేశాడు. ఇంట్లో ఆమె తన పని చేసుకుంటున్న సమయంలో నీ వల్ల పరువు పోయింది అని తిట్టాడు, వెనక నుంచి వచ్చి ఆమెని తుపాకితో కాల్చి చంపాడు. ఇక అక్కడ నుంచి సోదరిని చంపి పారిపోయాడు. గౌరవ్ ను అంజలి వివాహం చేసుకోవాలనుకుంది. కాని ఇది నచ్చక అతను ఈ దారుణం చేశాడు అంటున్నారు.

ఇది ఆమె సోదరుడికి నచ్చలేదు. చివరకు ఆమెని హత్య చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రియుడు కన్నీరు మున్నీరు అవుతున్నాడు.