Breaking News- పంజాగుట్టలో బాలిక మృతదేహం కలకలం

Girl's body found in Panjagutta

0
76

హైదరాబాద్ లోని పంజాగుట్ట ద్వారకాపూరి కాలనీలో బాలిక మృతదేహం కలకలం రేపింది. ఓ దుకాణం ముందు ఐదేళ్ల బాలిక మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలికది సాధారణ మరణమా? లేక హత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.