నిజంగా ఇలాంటి విషయం ఎప్పుడూ విని ఉండం ఎందుకంటే వారు చెట్లతో ప్రేమలో పడ్డారు. అంతేకాదు చెట్లని పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అనేది చూస్తే అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన అన్నీ స్ప్రింక్లే, బెత్ స్టీఫెన్స్ చెట్లతో ప్రేమలో పడ్డారు. తాము చెట్లని ప్రేమిస్తున్నాం అని వారిద్దరూ 2004 లో తెలుసుకున్నారు. ఆ తర్వాత చెట్లని 2008లో పెళ్లి చేసుకున్నారు.
వారికి ఈ ప్రకృతి, భూమి అంటే ఇష్టం. ఇద్దరూ ఎకో-సెక్సువల్ గా ప్రకటించుకున్నారు. అంతేకాదు ఈ జంట ఏదో సాధారణంగా పెళ్లి చేసుకోలేదు . 2008 లో దాదాపు 300 మంది సమక్షంలో చెట్లను వివాహం చేసుకున్నారు. కాలిఫోర్నియాలోని శాంతా క్రజ్లో వీరి వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం వీరిద్దరూ శాన్ ఫ్రాన్సిస్కోలోని రట్జర్స్ విశ్వవిద్యాలయంలో కలుసుకున్నారు. అప్పుడు ఇద్దరి అభిరుచి ఒకటే అని తేలింది.
ఇక వాటితోనే రొమాన్స్ చేస్తారు ఎలా అనుకుంటున్నారా? వీరు చెట్లను కౌగిలించుకోవడమే కాకుండా వాటి వేర్లను కౌగిలించుకుంటారు వాటి ఆకులు కొమ్మలను ముద్దాడతారు. వీరి ప్రేమని చూసి ప్రకృతి ప్రేమికులు మీరు నిజంగా గ్రేట్ అని అంటున్నారు.