షాకింగ్ న్యూస్ : ఆ ముగ్గురు అమ్మాయిల మలద్వారంలో బంగారం గోలీలు

0
59

వారు ముగ్గురు అడ్డంగా బుక్కయ్యారు. రక్షణ దళాల కన్నుకప్పి తప్పించుకుందామనుకున్నారు. కానీ దొరికిపోయారు. ఇంతకూ వారు చేసిన పనేంటి అనుకుంటున్నారా? మలద్వారం లో బంగారం తరలించే ప్రయత్నంలో విమానాశ్రయ అధికారులకు దొరికిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చదవండి.

కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ బంగారాన్ని ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి కేరళ వచ్చిన ముగ్గురు లేడీ ప్యాసింజర్స్ వద్ద దాదాపు రెండు కిలోల బంగారం గుర్తించి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు బంగారాన్ని తరలించేందుకు మలద్వారాన్ని రవాణా సాధనంగా వినియోగించుకున్నారు. ముందుగా బంగారాన్ని పేస్టుగా మార్చారు. ఆ పేస్టును క్యాప్సుల్స్లో (గోలీలలో) నింపారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రకుండా బంగారంతో నింపిన క్యాప్సల్స్ ను మలద్వారంలో దాచిపెట్టుకుని తరలించే ప్రయత్నం చేశారు.

ఎయిర్ పోర్ట్ లో ముగ్గురు ప్రయాణీకుల వ్యవహార శైలిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు విచారించారు. దీంతో మలద్వారంలో క్యాప్సుల్స్  రూపంలో తీసుకొస్తున్న బంగారం పట్టుబడింది. ముగ్గురు యువతులపై కేసు నమోదు చేశారు. బంగారం సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయిల అతి తెలివితేటలు చూసి అధికారులే ఔరా అని ముక్కు మీద వేలేసుకుంటున్నారు.