ఈ వ్యక్తి అతి తెలివి స్మ‌గ్గింగ్ – ప్యాంటుపై బంగారం పెయింట్ – అడ్డంగా దొరికాడు

Gold paint on pants

0
93

కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో ప్రతీ ప్రయాణికుడ్ని పరిశీలిస్తారు. కాస్త అనుమానం అనిపించినా ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తారు. ఈ మధ్య కొందరు అతి తెలివి ప్రదర్శించి బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా కేరళలోని ఓ వ్యక్తి హడావిడిగా విమానం దిగి బయటకు వస్తున్నాడు అయితే అతనిని కస్టమ్స్ అధికారులు చూశారు. అనుమానంతో ఆపారు.

అతని బట్టలు చూస్తే ఫ్యాంట్ పై పసుపు రంగు పడినట్లు కనిపించింది. అధికారులకి అనుమానం వచ్చింది.
పూర్తిగా చెక్ చేస్తే అతని ప్యాంటుపై మరకలు పెయింట్ కాదని అర్దం అయింది.అది మొత్తం బంగారమని తేలింది. ప్యాంటు రెండు పొరలతో ఉంది. బంగారాన్ని పేస్టుగా మార్చి దాని లోపల పొరలలొ నింపేశాడు.

మొత్తం ఇదంతా చెక్ చేస్తే 302 గ్రాముల బంగారం వచ్చింది. దీని విలువ రూ.14 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఆ ఫొటోలను అధికారులు నెట్టింట విడుదల చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అక్కడ కచ్చితంగా మెటల్ డిటెక్టర్ ఉంటుంది? మరి అసలు ఇతను ఎలా ఇలా ఆలోచించాడు అని అందరూ షాక్ అవుతున్నారు.