ఏపీ: శుభకార్యం జరగాల్సిన ఇంట పెను విషాదం నెలకొంది. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలో గల వినుకొండ గ్రామంలో ఓ శుభకార్యానికి కుటుంబమంతా వచ్చారు. కాగ ఐనవోలు గ్రామంలోనే గుండ్ల కమ్మ అనే నది ప్రవహిస్తుంది. కాగ ఈ నదిలో ఈత కోసం కొంత మంది వెళ్లారు. నదిలో ఈత చేస్తుండగా.. ప్రమాదవ శాత్తు ముగ్గురు గల్లంతు అయ్యారు. కుటుంబ సభ్యులు వచ్చి నదిలో గాలించగా ఆ ముగ్గురు మృతి చెందారు. మృతులను ఆయేషా సిద్ధికా (19), హీనా (22), ఫీజుల్లా ఖాన్ (19)గా గుర్తించారు.