అమ్మమ్మను చంపిన కొడుకు.. సాయం చేసిన తల్లి!

-

ఐదేళ్ల క్రితం జరిగిన వృద్ధురాలి హత్య కేసులో నిందితులను ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. బాధిత మహిళను చంపింది స్వయాన మనవడేనని తెలుసుకున్న పోలీసులు, స్థానికులు నిర్ఘారింతపోగా.. మృతదేహాన్ని దాచేందుకు మృతురాలి కుమార్తె సాయం చేసిందని తెలియటంతో సమాజం ఎటుపోతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే, శశికళ భర్త చనిపోగా.. బెంగళూరులోని కెంగేరి శాటిలైట్‌ కాలనీలో తన కుమారుడు సంజయ్‌, తల్లి శాంత కుమారితో కలిసి ఓ అద్దె ఇంటిలో నివసిస్తుండేది.

- Advertisement -

సంజయ్‌ చదువుల్లో బాగా రాణించేవాడు. పది, ఇంటర్‌లో 90 శాతానికి పైగా మార్కులు వచ్చాయి. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌పై ఇష్టంతో, బెంగళూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో చేరాడు. 2016లో కాలేజీ నుంచి తిరిగి వస్తూ సంజయ్‌ తన అమ్మమ్మ శాంత కుమారి కోసం గోబీ మంచూరియా తీసుకువెళ్లాడు. 69 ఏళ్ల శాంత కుమారి మంచూరియా తినేందుకు నిరాకరించి, తనకు వద్దంటూ మనవడిపై మంచూరియాను విసిరేసింది. దీంతో సంజయ్‌ వంటగదిలో దొరికిన వస్తువులతో ఆమె తలపై బలంగా మోదటంతో శాంత కుమారి అక్కడికక్కడే మృతి చెందింది.

అక్కడే ఉన్న శశికళ, కుమారుడు చేసిన పనికి నిర్ఘారింతపోయింది. తేరుకున్న తరువాత పోలీసులకు సమాచారం ఇద్దామనుకుంది కానీ, కన్నపేగు బతిమాలేసరకి కరిగిపోయింది. దీంతో తన తల్లిని తన కుమారుడే చంపాడన్న చేదు విషయాన్ని గోప్యంగా ఉంచింది. మృతదేహాన్ని మాయం చేసేందుకు ఏం చేయాలో తెలియక, సంజయ్‌ స్నేహితుడైన నందీష్‌ సాయం తీసుకున్నారు. ముగ్గురు కలిసి మృతదేహాన్ని ఇంటి అల్మారాలో దాచి, దుర్వాసన రాకుండా రసాయనాలు చల్లారు. తరువాత ఇంటి లోపలే గోడకు సమీపంలో గొయ్యిని తవ్వి, మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు సిమెంట్‌, ప్లాస్టర్‌, రంగులు వేశారు. అనంతరం తమ బంధువులకు బాగోలేదని చెప్పి.. ఊరు వెళ్తున్నామని అద్దె ఇంటి నుంచి పారిపోయారు.

2017 మే 7న ఇంటి యజమాని గోడకు సమీపంలో ఉన్న రక్తపు మరకలతో ఉన్న చీరను చూసి షాక్‌ తిన్నాడు. తరువాత శాంతి కుమారి కనిపించకపోవటం, తల్లి, కుమారుడు అదృశ్యం కావటంపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందటంతో అసలు విషయం బయటపడింది. ఈ వార్త అప్పట్లో సంచలనం సృష్టించటంతో, సంజయ్‌, శశికళ మరింత జాగ్రత్తపడ్డారు. మెుదట శివమెుగ్గలో తలదాచుకొని, తరువాత మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు పారిపోయారు. ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ అవుదాం అనుకున్న సంజయ్‌, ఓ హోటల్‌లో సప్లయర్‌గా, ఆమె తల్లి శశికల క్లీనర్‌గా జీవనం సాగించారు. చివరకు పోలీసులకు చిక్కి, ఇప్పుడు ఊసలు లెక్కపెడుతున్నారు. మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి సాయం చేసిన నందీష్‌ను కూడా కొల్హాపూర్‌లోనే అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...