ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేము. అప్పటి వరకూ ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉంది. కాని ఒక్క ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబాన్ని విషాదంలో నింపింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా ఊత్తంకరై శింగారపేటలో జరిగిన విషాద ఘటన అందరిని కలిచి వేసింది. ఇక్కడ స్ధానికంగా నివాసం ఉంటున్న ఇందిరా, పిచ్చుమణి దంపతులకు మహాలక్ష్మి అనే పాతికేళ్ల వయసున్న కూతురు ఉంది.
ఆమెకు వివాహం అయింది వారికి అవంతిక అనే మూడేళ్ల పాప కూడా ఉంది. డాబా మీద బట్టలు ఆరేసేందుకు ఇందిరా మనమరాలు అవంతికను ఎత్తుకుని పైకి వెళ్లింది. బట్టలు ఆరవేస్తున్న సమయంలో పక్కన ఉన్న విద్యుత్ వైర్ ఆమెకి తలిగింది. ఆమెకి ఆ చిన్నారికి విద్యుత్ తగిలి గాయాలు అయ్యాయి. వెంటనే అరుపులు అరవడంతో కింద నుంచి అవంతికి తల్లి పైకి వచ్చింది.
వారిని పక్కకు లాగేందుకు ప్రయత్నించి మహాలక్ష్మి కూడా కరెంట్ షాక్‌కు గురైంది.
దీంతో ముగ్గురూ అక్కడే ప్రాణాలు కోల్పోయారు. పక్కవారు గమనించి వెంటనే విద్యుత్ అధికారులకి ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో కరెంట్ సరఫరా నిలిపివేశారు అధికారులు. ఈ విద్యుత్ షాక్ వల్ల ఆ కుటుంబంలో ముగ్గురు చనిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.