Breaking: తమిళనాడు రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం..

0
81
Kabul

తమిళనాడు రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తంజావుర్​లో కరిమేడు అప్పర్​ ఆలయ రథం వేడుకలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దానికి గల కారణం ఏంటంటే..ఆలయ రథాన్ని గుడికి తీసుకొస్తుండగా రథం విద్యుత్ తీగకు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో రథోత్సవంలో పాల్గొన్న 11 మంది అక్కడిక్కడే బూడిద అయ్యారు. ఈ ఘటనలో మరో పది మంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఇంకా మృతుల సంఖ్య అధికంగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఘటనలో మంటల కారణంగా రథం కూడా కాలి పోయినట్టు సమాచారం తెలుస్తుంది.