ఏడు పెళ్లిళ్లు చేసుకుంది – కొత్తగా మరో ప్రియుడు చివరకు ఎంత ప్లాన్ వేసిందంటే

ఏకంగా ఆ ప్రియుడితో వివాహానికి ప్లాన్ వేసింది

0
89

ఈ మహిళ ఏకంగా ఏడు పెళ్లిళ్లు చేసుకుంది. ఏడో భర్తతో జీవనం సాగిస్తూనే మరో వ్యక్తితో ప్రేమలో పడింది. ఈమె గురించి విని పోలీసులు షాక్ అయ్యారు. ఏకంగా ఆ ప్రియుడితో వివాహానికి ప్లాన్ వేసింది. దీంతో భర్త అంగీకరించలేదు. ఇటీవల యూపీలోని హరిపర్వత్ ప్రాంతంలోని స్పీడ్ కలర్ ల్యాబ్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. అతనిని తలపై గాయపరిచి హత్య చేశారు.

ఇక పోలీసులు అన్నీ కోణాల్లో విచారణ చేపట్టాడరు. అతని భార్య జెమవ్, ముగ్గురు పిల్లలు ఉండటంతో ఆమెని ప్రశ్నించారు. భర్త హత్య గురించి అబద్దం చెప్పింది. పిల్లలను అలాగే చెప్పేలా చేసింది. కాని హత్య జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు చూశారు. అక్కడ పుటేజ్ పరిశీలించారు. అక్కడ ఓ వ్యక్తి నడుస్తూ కనిపించాడు. సిర్సిరా గ్రామానికి చెందిన రాజు అలియాస్ సుఖ్దేవ్గా అతనిని గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు.

సుఖ్దేవ్ జెమవ్ను ప్రేమించుకుంటున్నారు. వివాహానికి సిద్దం అయ్యారు. ఆమె భర్త రాజేంద్ర వీరి పెళ్లికి అడ్డుగా ఉన్నాడని భావించారు. చివరకు రాజేంద్ర తలపై సిలిండర్తో కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. చివరకు పోలీసులు ఆమెని, ప్రియుడ్ని అరెస్ట్ చేశారు.