బ్యాంకు అధికారుల వేధింపులు..స్టూడెంట్ ఆత్మహత్య

0
136

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. నందిగామలోని రైతుపేటలో ఓ విద్యార్థి ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రైతుపేటకు చెందిన హరిత వర్షిణి ఎంసెట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుంది. వర్షిణి తండ్రి చదువు కోసం బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి అవమానకరంగా మాట్లాడారు.  దీనితో  మనస్థాపం చెందిన వర్షిణి  తన తండ్రితో బాధపడింది. అనంతరం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఉన్నత చదవులు చదువుకోలేక, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో వర్షిణి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.