నటి చౌరాసియాపై దాడి చేసింది ఇతనే..

He is the one who attacked the actress Chaurasia

0
106

హైదరాబాద్: కేబీఆర్‌ పార్కు వాక్‌వేలో సినీ నటి నటి చౌరాసియాపై దుండగుడి దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఆ కేసును పోలీసులు ఛేదించారు. గత ఆదివారం రాత్రి 8.40 గంటల సమయంలో కేబీఆర్‌ పార్కు వాక్‌వేలో సినీ నటి షాలు చౌరాసియా వాకింగ్‌ చేస్తుండగా దుండగుడు ఆమెపై దాడి చేసి..లైంగికి దాడికి యత్నించాడు.

అలాగే ఆమె సెల్‌ఫోన్‌ తస్కరించి పరారైన ఘటన పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఘటన జరిగిన అయిదు రోజుల్లోనే ఛేదించారు. నిందితుడు తెలుగు చలన చిత్రపరిశ్రమలో లైట్‌మెన్‌గా పని చేస్తున్న కె.బాబుగా గుర్తించారు. పక్కా ప్రణాళికతో శుక్రవారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని ఇందిరానగర్‌లో అదుపులోకి తీసుకున్నారు.