వయసు 80 ఏళ్లు – నీ భార్యని పంపు 10 వేలు ఇస్తా అన్నాడు చివరకు ఏమైందంటే

అతను ముందు రోజు వార్నింగ్ ఇచ్చాడు అయినా ముసలోడు రెచ్చిపోయి రెండోరోజు పదివేలు ఇస్తాను గొడౌన్ కి పంపించు అన్నాడు

0
95

అతని వయసు 80 ఏళ్లు ఈ వయసులో ఎవరైనా హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఇంట్లో ఉంటారు. పిల్లలను మనవలని చూసి ఆనందిస్తారు. అయితే ఇక్కడ ఈ వయసు ఉన్న వ్యక్తికి షాపులు సొంత ఇల్లు చాలా ఆస్తులు ఉన్నాయి. అయినా బుద్ది మాత్రం వక్రబుద్ది. కామంతో కళ్లుమూసుకుపోయిన అతడు. ఓ వ్యక్తి భార్యను తన వద్దకు పంపాలని కోరాడు. చివరకు అతను ఏం చేశాడో తెలిసి అందరూ షాక్ అయ్యారు.

మహారాష్ట్రలోని నవీ ముంబైలో శమకాంత్ అనే 80 ఏళ్ల వృద్దుడికి ఉల్వేలో కోట్లు విలువ చేసే అనేక ఆస్తులు ఉన్నాయి. త‌ర‌చూ అత‌ను మోహన్ చౌదరి షాపుకి వెళ్లేవాడు. అక్కడ అతని భార్య నచ్చడంతో నీ భార్యని తనతో పడుకోబెట్టాలి అని కోరాడు. దీంతో అతను ముందు రోజు వార్నింగ్ ఇచ్చాడు అయినా ముసలోడు రెచ్చిపోయి రెండోరోజు పదివేలు ఇస్తాను గొడౌన్ కి పంపించు అన్నాడు.

దీంతో మోహన్ అతన్ని వెనక్కి నెట్టాడు. అతను నేల మీద పడిపోయాడు. తల టేబుల్ కొనకు తాకడంతో రక్తస్రావం జరిగింది. మోహన్ షాప్ షట్టర్ ని మూసివేశాడు. ఆ తర్వాత శమకాంత్ గొంతు కోశాడు. చివరకు అతని మృతదేహం కొద్దిరోజులు బాత్రూమ్ లో దాచాడు. తర్వాత బైక్ పై బెడ్ షీట్ లో చుట్టి ఊరి చివ‌ర పడేశాడు. చివరకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇవ్వడంతో సీసీటీవీ పరిశీలిస్తే మోహన్ నిందితుడు అని తేలింది. తన భార్యని నీచంగా మాట్లాడటంతో ఈ పని చేశాను అని చెప్పాడు.