లక్షణమైన భార్యను లక్షకు అమ్మేశాడు!..వేరే వ్యక్తితో పారిపోయిందని..

He sold his typical wife for a lakh! .. fled with another man ..

-

లక్షణమైన భార్యను ఓ భర్త రూ.లక్షకు అమ్మేశాడు. ఈ అమానుష ఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశాలోని బొలంగీర్‌కు చెందిన సరోజ్‌రాణాకు, సురేకెల గ్రామానికి చెందిన రేవతికి 2 నెలల క్రితం పెళ్లి జరిగింది. వారికి ఫేస్ బుక్‌లో పరిచయం కాగా..పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

- Advertisement -

కొన్నిరోజుల తర్వాత భర్త సరోజ్ రాణా ఉపాధి కోసం రేవతిని తీసుకొని రాజస్థాన్‌ వెళ్లాడు. అక్కడ ఓ ఇటుకల బట్టీలో ఇద్దరూ పనికి కుదిరారు. కొన్నాళ్ల తర్వాత భర్త సరోజ్‌రాణా రాజస్థాన్‌లోని ఓ కుటుంబానికి భార్య రేవతిని రూ.లక్షకు అమ్మేసి సొంత గ్రామానికి తిరిగి వచ్చేశాడు.

భార్యను అమ్మేయగా వచ్చిన ఆ డబ్బుతో విలాసవంతమైన హోటల్‌లో భోజనం చేసి, ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆమె వేరే వ్యక్తితో పారిపోయిందని నమ్మబలికాడు. అతి కష్టం మీద రాజస్థాన్ పోలీసుల సాయంతో ఆ యువతిని కాపాడి ఒడిశా పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. తనను అమ్మిన విషయం తెలియదని, ఇంట్లో పని చేయాలంటూ పంపించాడని రేవతి చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...