కోడి కరిచిందనుకున్నాడు కాని పాము కరిచి ప్రాణాలు కోల్పోయాడు

కోడి గుచ్చింది అని పొరబడ్డాడు పాపం ఈ దారుణం జరిగింది

0
125

సరదాగా ఆ 10 ఏళ్ల బాలుడు స్నేహితులతో ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో అతనిని పాము కరిచింది. అయితే అతను మాత్రం ఏదో కోడి పొడించింది అని భావించి ఆటలో ఉన్నాడు. తర్వాత ఇంటికి వెళ్లి అక్కడ కోడి పొడిచింది అని భావించి పసుపు రాసుకున్నాడు. కాసేపు ఆడుకుని అక్కడే ఉన్నాడు.

ఇలా ఆడుకుంటూ ఉండగా కొద్దిసేపటికే కిందపడిపోయాడు బాలుడు. మహబూబాబాద్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది, ఇలా పడిపోయిన బాలుడ్ని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆ బాలుడ్ని పరీక్షించిన వైద్యులు పాము కరిచినట్టుగా గుర్తించారు. అతనికి చికిత్స ప్రారంభించారు. అయితే పరిస్థితి విషమించడంతో రాత్రి మరణించాడు.

అయితే అతని చేతిపై పాము కాటు వేసింది అనేది అతను గుర్తించలేదు. ఆడుకునే సమయంలో ఇంటిపక్కనే ఉన్న పాత భవనంలోకి స్నేహితులతో కలిసి వెళ్లాడు. పైన ఓ కోడి పొదిగి ఉంది. అయితే అక్కడే ఓ పాము కూడా కనిపించకుండా ఉంది. అక్కడ సెల్ప్ అందుకునే సమయంలో చేయి పెట్టాడు. అక్కడ పాము కరిచింది. కాని అది కోడి గుచ్చింది అని పొరబడ్డాడు పాపం ఈ దారుణం జరిగింది.