వీడెవడండి బాబు – తమ్ముడికి కాబోయే భార్యని తీసుకుని అన్న పరార్

ఊరంతా షాక్ అయింది

0
90

ఈ రోజుల్లో బంధాలు అనుబంధాలు మానవ సంబంధాలు ఏమీ ఉండటం లేదనిపిస్తుంది కొన్ని ఘటనలు చూస్తుంటే. కొందరు చేస్తున్న పనులకి ఇవి మంటకలుస్తున్నాయనే చెప్పాలి. తమ్ముడి భార్య అంటే తల్లి చెల్లిగా చూడాలి. కానీ కొందరు అన్న భార్య అయిన వదినపై కన్నేస్తారు, మరికొందరు మరదలిపై కన్నేస్తారు .ఇలాంటి దారుణాలు ఘటనలు చాలా వింటున్నాం చూస్తున్నాం.

రాజస్ధాన్ లో దారుణం జరిగింది కట్టుకున్న భార్యని వదిలేసి, మరికొద్ది రోజుల్లో తమ్ముడికి కాబోయే భార్యని తీసుకుని పారిపోయాడు అతని అన్న.వినడానికే దారుణంగా ఉంది ఈ ఘటన రాజస్ధాన్ లోని బుండి ప్రాంతంలో జరిగింది. బుండి ప్రాంతంలో రాజేష్ కి వివాహం అయింది. ఈ సమయంలో అతని తమ్ముడికి స్ధానికంగా ఓ అమ్మాయితో వివాహం సెట్ అయింది.

అయితే ఆమెని ప్రేమలోకి దించాడు. చివరకు ఆమెని తీసుకుని పారిపోయాడు. ఇక అమ్మాయి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు కంగారు పడ్డారు. పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే మేమిద్దరం బాగానే ఉన్నామని, మా కోసం వెతకద్దని ఈ వ్యక్తి వీడియో తీశాడు. చివరకు ఊరంతా షాక్ అయింది ఆ అమ్మాయి మైనర్ అని తెలుస్తోంది.