ఉత్తరప్రదేశ్లోని గోపాల్పుర గ్రామంలో అక్కడ ఓ యువతిని పక్క గ్రామానికి చెందిన అబ్బాయి ప్రేమిస్తున్నాడు. తరచూ వీరు కలుసుకుంటున్నారు. అయితే ఆమె పుట్టిన రోజు అని తెలియడంతో, ప్రేయసి బర్త్డేకి గ్రాండ్ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. భారీగా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేశాడు. ఆమె స్వగ్రామం చేరుకున్నాడు. ప్రియుడు ప్రియురాలు కలిసి పొలాల్లోకి వెళ్లారు.
ఈ లోపు వారిద్దరినీ జంటగా చూసిన గ్రామస్తులు ఊర్లోకి తీసుకొచ్చారు.
అయితే ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పారు. దీంతో గ్రామస్తులు ఆమెని పెళ్లి చేసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు. చివరకు పోలీసుల దగ్గరకు వెళ్లారు. ఇక అబ్బాయి పేరెంట్స్ కూడా వచ్చారు. ఇరు కుటుంబాల మధ్య మాటలు జరిగాయి చివరకు అబ్బాయి పేరెంట్స్ కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు.
యువతి పేద కుటుంబానికి చెందిన ఆమె కావడంతో ఆమె పెళ్లికి సహాయం చేసేందుకు గ్రామస్తులందరూ ముందుకు వచ్చారు. ఆదివారం వారికి పెళ్లి చేశారు గ్రామస్తులు. అందరూ డబ్బువేసుకుని ఆ అబ్బాయికి ఫ్రిజ్, మంచం, టీవీ వంటింటి సామాన్లు కొని ఇచ్చారు. మొత్తానికి ఆమెకి సర్ ప్రైజ్ ఇద్దామనుకున్నాడు. అతనిని గ్రామస్తులు సర్ ఫ్రైజ్ చేశారు అంటున్నారు ఈ విషయం తెలిసిన వారు.