ఎక్కడైనా కిరాణా వస్తువులు, కూరగాయలు రేట్లు ఎక్కువ అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం, మార్కెట్ కమిటీలు నిర్ణయించిన రేటు కంటే ఎక్కువ అమ్మితే షాపులు కూడా క్లోజ్ చేయిస్తారు. కాని ఇక్కడ మాత్రం ప్రజలకు రేట్లు తగ్గించి కూరగాయలు అమ్మినందుకు అతనిపై కేసు పెట్టారు. వినడానికి విచిత్రంగా ఉందా.
ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే తక్కువ రేటుకు అమ్మినందుకు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. వక్వాస్ అనే వ్యక్తి లాహోర్ మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. అక్కడ ప్రజలు కరోనా వల్ల ఇబ్బందుల్లో ఉన్నారు. దీంతో ఏదైనా సాయం చేయాలి అని అనుకున్నాడు.
ప్రభుత్వ ధరకంటే తక్కువకు కూరగాయలు అమ్మాడు. కిలో టమాటా ప్రభుత్వ ధర పాక్ లోరూ.50 ఉండగా అతడు 25కే ఇచ్చాడు. ఉల్లిగడ్డ పాక్ లో రూ. 40 ఉండగా 20కే ఇచ్చాడు. దీంతో పక్క వ్యాపారుల బిజినెస్ డల్ అయింది. దీంతో అతనిపై ఫిర్యాదు చేశారు.అతనిపై పోలీస్ కేసు నమోదు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచడంతో అతడికి జైలు శిక్ష విధించింది కోర్టు. దీంతో నెటిజన్లు దీనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.