Breaking News : హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత

Heavy ganja seizure in Hyderabad

0
124

హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధి సరూర్ నగర్ లో భారీగా గంజాయి పట్టుబడింది. తూర్పు గోదావరి జిల్లా నుంచి గంజాయిని హైదరాబాద్ కు బొలేరేలో తరలిస్తుండగా పోలీసులు సరూర్ నగర్ వద్ద పట్టుకున్నారు. దాదాపు 320 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.40 లక్షలు. కర్ణాటకకు చెందిన మైత్రి రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.