రాజస్ధాన్ లోని చిన్ ప్రాంతంలో ఓ కుటుంబం ఉంటోంది. ఆకుటుంబంలోని ఇషా అనే అమ్మాయి ఇంటర్ చదువుతోంది. స్ధానికంగా ఉన్న ఓ యువకుడితో ఆమెకి పరిచయం అయింది. అయితే రోజూ ఇద్దరూ ఫోన్ లో తెగ మాట్లాడుకునేవారు. చివరకు ప్రేమలో మునిగారు. ఓరోజు నేరుగా నిన్ను కలవాలి అని ప్రియుడు అనడంతో రాత్రి ఇంత సమయంలోనా వద్దు ఇంట్లో అందరూ ఉన్నారు అని ఆమె చెప్పింది.
కాని మనోడు సినిమా స్టైల్లో ఆమె ఇంటి గోడ దూకి పెరటి వైపు వచ్చాడు. ఈ సమయంలో ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో ఆమె తల్లి నీరు తాగేందుకు వచ్చింది. వెంటనే కూతురు రూమ్ డోర్ తీసి ఉండటం చూసి లోపల చూస్తే ఆమె లేదు. దీంతో భర్తకి చెప్పింది ఇళ్లంతా చూశారు. వెంటనే పెరట్లో చూస్తే వీరిద్దరూ సరసాల్లా ఉన్నారు.
కోపంతో ఊగిపోయిన ఆమె తండ్రి అతన్ని పట్టుకున్నాడు. ఇంటి పక్కన ఉండే అతని బావ అలాగే అతని సోదరుడు స్ధానికులు వచ్చి ఆ కుర్రాడ్ని కట్టేశారు. వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు . అతని తల్లిదండ్రులని పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించారు.