పోలీస్ స్టేషన్‌కు నేడు హీరో నాగశౌర్య తండ్రి..

Hero Nagashourya's father to the police station today

0
99

రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫామ్‌హౌస్ పేకాట కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు సుమన్‌ను రెండు రోజుల కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అప్పగించింది. గుత్తా సుమన్‌ను నార్సింగి పోలీసులు నేడు, రేపు ప్రశ్నించనున్నారు. నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ ఇవాళ పోలీస్ స్టేషన్‌కు రానున్నారు. ఫామ్‌హౌస్‌ రెంటల్ అగ్రిమెంట్లు తీసుకురావాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది. రెంటల్ అగ్రిమెంట్ల ఆధారంగా రవీంద్రను పోలీసులు ప్రశ్నించనున్నారు.

మరోవైపు గుత్తా సుమన్‌పై ఏపీలో ఉన్న కేసులపై నార్సింగి పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయవాడకు చెందిన గుత్తా సుమన్‌కుమార్‌పై ఏపీ, తెలంగాణలోని వివిధ ఠాణాల్లో పలు కేసులు నమోదైనట్లు నార్సింగి పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ఆగస్టు 15న గచ్చిబౌలి ఠాణా పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పేకాట ఆడుతూ సైబరాబాద్‌ పోలీసులకు చిక్కినట్టు కూడా గుర్తించారు.