త్రిషపై కేసు పెట్టి అరెస్ట్ చేయండి హిందూ సంఘాలు డిమాండ్ – అసలు ఏమైందంటే

Hindu groups demand arrest of actress Trisha

0
74

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా హీరోయిన్ త్రిష కు ఎంతో పేరు ఉంది. మంచి గుర్తింపు తెచ్చుకున్న నటిగా లక్షలాది మంది అభిమానులని సంపాదించుకుంది. అయితే స్టార్ హీరోలు అందరితోనూ ఆమె నటించింది. చాలా కాలంగా స్లో అయింది ఆమె చిత్ర సీమలో. అంత వేగంగా సినిమాలు చేయడం లేదు. తనకు వచ్చిన ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సక్సెస్ కోసం ట్రై చేస్తుంది త్రిష.

త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో కొంతకాలం టాక్ నడిచింది. కానీ అవన్నీ రూమర్లని తేల్చింది.
తాజాగా ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాలు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ ఇలా ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి అనేది చూస్తే.

సస్సెషనల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఆమె నటిస్తోంది. ఇందులో త్రిషతోపాటు విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తి, జయరామ్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇండోర్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో భాగంగా త్రిష కారు దిగి చెప్పులతో శివుడు, నంది విగ్రహాల మధ్య నడుచుకుంటూ వచ్చిన సన్నివేశాలను షూట్ చేశారు. ఈ ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
శివుడు, నంది విగ్రహాల మధ్య చెప్పులతో నడవడం ఏమిటి అని విమర్శలు చేస్తున్నారు. ఆమెని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.