మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) మృతిపై ఆయన భార్య శిరీష స్పందించారు. ఆర్కే మృతి చెందిన విషయం పార్టీ ప్రకటించిన తర్వాతే నిజంగా భావిస్తామన్నారు. ఆర్కే మృతి చెందినట్టుగా మీడియాలో వచ్చే వార్తలే చూస్తున్నామని, ఆర్కే మృతి చెందారని ఛత్తీస్ ఘడ్ డీజీపీ ప్రకటించారని ఆయనకు ఈ సమాచారం ఎవరిచ్చారో చెప్పలేదన్నారు.
దండకారణ్యం పరిధిలోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం మావోయిస్టు అగ్రనేత ఆర్కే మరణించినట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసు వర్గాలు ధ్రువీకరిస్తుండగా..మావోయిస్టు పార్టీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన మరణించారన్న వార్తను ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. ‘ఆర్కే ఆనుపానులు తెలుసుకునేందుకు పోలీసులు పన్నిన కుట్ర ఇది’ అని ఆయన భార్య ఆరోపిస్తుంది.