హోం వర్క్ ఒత్తిడి..ఒంటిపై పెట్రోల్ పోసుకుని 9వ తరగతి స్టూడెంట్ సూసైడ్

0
97

హోంవర్క్ ఒత్తిడి తట్టుకోలేక 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరువారూర్ జిల్లాలోని పెరళంలో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో సంజయ్‌ 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో రోజూ ఇచ్చే హోం వర్క్‌ కారణంగా సంజయ్‌ తీవ్ర ఒత్తిడికి గురయ్యేవాడు. దీనితో తనను వేరే స్కూల్‌కి మార్చమని తల్లిదండ్రులను బాలుడు కోరాడు. అందుకు సంజయ్‌ తల్లిదండ్రులు తిరస్కరించారు. దీంతో మరింత ఒత్తిడికి గురైన బాలుడు ఇంట్లోనే పెట్రోల్‌ శరీరంపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాల పాలైన సంజయ్‌ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.