రోజురోజుకు మనుషులు దిగజారిపోతున్నారు. హత్యలు, దొంగతనాలు, ఆత్మహత్యలు, అత్యాచారాల వంటి ఘటనలు నిత్యం జరుగుతుండడం కలకలం రేపుతోంది. వావి వరసలు, చిన్న పెద్ద తేడాలు మరిచి మనుషులు మృగాళ్ళుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని కోహెఫిజా ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. 4వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై స్కూల్ అటెండర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. పాఠశాలలోని మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది.