యూపీలో ఘోరం..మహిళపై గ్యాంగ్ రేప్

Horror in UP .. Gang rape on a woman

-

ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన కామాంధుల ఆకృత్యాలు ఆగడం లేదు. పశువుల కోసం గడ్డి తీసుకొచ్చేందుకు అడవికి వెళ్లిన 55 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు..సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తర్​ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

పశువుల కోసం గడ్డి తీసుకొచ్చేందుకు మహిళ అడవిలోకి వెళ్లిందని, ఆ సమయంలో నిందితుల్లో ఒకరు అక్కడే పశువులకు కాపలా కాస్తున్నాడని బాధితురాలి భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యక్తి గంజాయి తీసుకున్నాడని చెప్పారు.

ఈ క్రమంలోనే అటు వైపు వెళ్లిన మహిళపై మరో ముగ్గురితో కలిసి అత్యాచారం చేశాడని వివరించారు. నిందితులందరూ మత్తులోనే ఉన్నారని డీసీపీ వృందా శుక్లా తెలిపారు. వీరిని అరెస్టు చేయడం కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దోషులను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...