ఉత్తరప్రదేశ్ లో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. మానవత్వం లేని కొందరు దుండగులు ఓకే కుటుంబానికి చెందిన అయిదుగురిని పదునైన ఆయుధాలతో హత్య చేసిన అనంతరం ఇంటికి నిప్పు పెట్టి పరారయ్యారు. ఈ హృదయ విదారక ఘటన ప్రయాగ్ రాజ్ జిల్లాలో కేవ్ రాజ్ పూర్ గ్రామంలో జరిగింది. మంటలను గమనించి స్థానికులు పోలీసులకు పిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. బయట నిద్రిస్తున్న క్రమంలో ఈ దారుణ హత్యలు చోటుచేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా ఈ హత్యకు గల కారణాలు ఏంటని పోలీసులు ఆరా తీస్తున్నారు.