రైలు ప్రయాణం చేసే సమయంలో చైన్ లాగే పొరపాటు ఎవరూ చేయరు. ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే చైన్ లాగుతారు అనే విషయం తెలిసిందే. అయితే చాలా మందికి ఓ అనుమానం ? అసలు రైలులో ఈ చైన్ లాగిన వెంటనే రైల్వే పోలీసులు ఉద్యోగులు కరెక్టుగా ఆ బోగీలోకి ఎలా వస్తారు అని, అయితే దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అసలు ఈ సర్వీసు ఏమిటి అంటే , అత్యవసర పరిస్థితిలో కదులుతున్న రైలును ఆపడానికి బోగీలో చైన్ సౌకర్యం కల్పించారు. దీనిని లాగితే ట్రైన్ ఆగిపోతుంది. కానీ ఇక్కడ ఓ విషయం గుర్తించాలి అనవసరంగా దీనిని లాగి ట్రైన్ ఆపితే రైల్వే సెక్షన్ల కింద శిక్షలు ఉన్నాయి. చైన్ లాగినప్పుడు బ్రేక్ పైప్ నుంచి గాలి పీడనం విడుదల అవ్వడం వల్ల బ్రేకులు అప్లై అవుతాయి. దీంతో రైలు సడెన్గా ఆగిపోతుంది.
ఇక ఏ బోగీ అనేది ఎలా తెలుస్తుంది అంటే? మీరు ఏ బోగి నుంచి చైన్ లాగారో అక్కడ పెట్టెకు ఇరువైపులా ఉన్న చార్ట్ కమ్ ప్యాసింజర్ అలారం లైట్ వెలుగుతుంది. దీంతో ఏ పెట్టె నుంచి చైన్ లాగారో రైల్వే పోలీసులకు తెలుస్తుంది. అక్కడికి రైల్వే అధికారులు గార్డులు చేరుకుంటారు.