నాపరాళ్లకింద భారీ కింగ్ కోబ్రా – ఈ అమ్మాయి ఎలా పట్టుకుందో చూడండి

Huge King Cobra under maple stones - see how this girl is caught

0
135

ఎవరైనా పాముని చూస్తేనే హడలిపోయి పారిపోతారు. ఇక అక్కడ పాము ఉంది అని తెలిస్తే దాని దరిదాపులోకి కూడా వెళ్లరు. కానీ కొందరు మాత్రం పాములతో ఆటలు ఆడతారు. అక్కడ పాము ఉంది అని తెలిస్తే దానిని పట్టుకుంటారు. సింగిల్ హ్యాండ్ తో దానిని రబ్బర్ తిప్పినట్లు తిప్పేస్తారు. నాగుపాము అయినా కొండచిలువ అయినా ఏదైనా సరే వీరికి చాలా కామన్. ఇలాంటి వీడియోలు మనం ఎన్నో చూసి ఉంటాం.

అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఇలా పాములని పట్టుకున్న వీడియోలు ఫోటోలు మనం ఎన్నో చూసి ఉంటాం. ఓ యువతి కోబ్రాను ఒంటి చేత్తో పట్టేసింది.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఓ ఇంటి నిర్మాణ స్థలంలో ఉన్న నాప రాళ్ల కింద పాము కనిపించింది. అయితే జనం చాలా మంది భయంతో దాని దగ్గరకు కూడా వెళ్లలేదు. కానీ ఈ సమయంలో ఓ యువతి అక్కడకు వెళ్లి ఆ పాముని బయటకు తీసింది. తర్వాత పాముని నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసింది. ఆ యువతి దైర్యానికి అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు. ఈ వీడియో చూడండి …https://www.instagram.com/p/CPItf_ch2re/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again