ప్రియుడి కోసం భర్తపై భారీ స్కెచ్ వేసింది – పదోతరగతి నుంచే వీరి ప్రేమ

huge sketch on her husband for Lover -Their love since tenth grade

0
113

పదోతరగతిలో వారు ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ ఐదు సంవత్సరాలు సాగింది. సినిమాలు షికార్లు అన్నీ చేశారు. కాని వీరి ప్రేమ విష‌యం ఇంట్లో తెలిసి ఆమెకి తల్లిదండ్రులు వేరే యువకుడితో పెళ్లి చేశారు. చివరకు అబ్బాయి దుబాయ్ లో ఉద్యోగం కావడంతో ఆమెని అక్కడకు తీసుకువెళ్లాడు. ఇక ఆమె సంతోషంగా ఉంది ఈ జంటకి ఓ పాప పుట్టింది.

ఇక రెండోవ కాన్పు కావడంతో తన తల్లి ఇంటికి వచ్చింది. ఈ సమయంలో వారి స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో మళ్లీ ప్రియుడితో పోన్ నెంబర్ తీసుకుని అతనితో మాట్లాడేది. ఇలా ఇద్దరూ చాలా దగ్గర అయ్యారు.
అప్పుడప్పుడూ ఇద్దరూ ఏకాంతంగా గడిపేవారు. ఇక భర్త దుబాయ్ లో ఉద్యోగం వదిలేసి ఇంటికివచ్చేశాడు. దీంతో కొన్ని రోజులకి భ‌ర్త‌కి భార్య గురించి తెలిసింది. చిన్న‌నాటి స్నేహితుడితో అఫైర్ పెట్టుకుంది అని అర్ద‌మైంది.

పద్ధతి మార్చుకోవాలని ఆమెను మందలించి వదిలేశాడు. ప్రియుడి మోజులో పడి ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. చివరకు ఉదయం పూట ఇద్ద‌రూ వాకింగ్ కు వెళుతున్న సమయంలో ప్రియుడు అతన్ని రాడ్ తో కొట్టి చంపేశాడు. దొంగలు దాడి చేసి భ‌ర్త‌ని చంపేశారని పోలీసులకు చెప్పింది. కాని అన్నీ కోణాల్లో విచారణ చేస్తే చివరకు ఆమె ప్రియుడు ఇలా దాడి చేశాడని తేలింది. విశాఖ‌లో ఈ దారుణం జ‌రిగింది.