భర్తకి తెలియకుండా భార్య – భార్యకి తెలియకుండా భర్త అఫైర్ – ట్విస్ట్ మాములుగా లేదు

Husband affair without wife's knowledge

0
85

ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది నిత్యం ఆ సోషల్ సైట్లతో బిజీగా ఉంటున్నారు. కుటుంబాలని పెద్ద పట్టించుకోవడం లేదు. ఏ ఫోటో పెడతాం ఏ వీడియో చేద్దాం ఏ రీల్స్ చేద్దాం ఇలాంటి ఆలోచనలతో ఉంటున్నారు లైక్స్ కామెంట్ల కోసం ఎలాంటి పిక్స్ పెడుతున్నారో కొంత మందిని చూస్తుంటే తెలుస్తుంది.

అయితే కొన్ని కాపురాలు అందమైన జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. ముంబైకి చెందిన ఓ జంట వివాహం అయి మూడు సంవత్సరాలు అయింది. ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటున్నారు సొంత ఇళ్లు ఉంది. కాని ఇద్దరూ మాత్రం కొద్ది నెలలుగా సరిగ్గా ఉండటం లేదు. ఒకరిపై ఒకరికి ఇష్టం పోయింది చివరకు ఓ సోషల్ సైట్ లో ఇద్దరూ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని కొత్త పరిచయాల కోసం చూశారు.

ఇక్కడే ఓ ట్విస్ట్ జరిగింది వీరిద్దరూ ఒకరికి ఒకరు ఫేక్ ఐడీలతో పరిచయం అయ్యారు. ఇక ఇద్దరూ కూడా వేరే వేరే పిక్స్ పంపుకున్నారు. చివరకు ఇద్దరూ ఓ రోజు ఎంజాయ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యారు. చివరకు ఓ ప్లేస్ కి ఆమెని రమ్మని అడ్రస్ పంపాడు అతను. ఆమె అక్కడకు వెళ్లింది డోర్ ఓపెన్ చేసే సరికి భార్య భర్త ఒకరిని ఒకరు చూసుకున్నారు. నువ్వు నన్ను మోసం చేశావు అంటే , నువ్వు నన్ను మోసం చేశావు అని రచ్చ చేశారు. చివరకు విడాకుల వరకూ వెళ్లింది ఈ జంట.