ఉద్యోగాల పేరిట భార్య, భర్త మోసం..చివరకు ఏం జరిగిందంటే?

Husband and wife cheating in the name of jobs..what happened in the end?

0
131

ఉద్యోగాల పేరిట ఓ దంపతులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. కట్టు కథలు అల్లుతూ అమాయకుల జేబు ఖాళీ చేస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ యువతి వద్ద నుండి డబ్బులు కాజేశారు. చివరికి అదంతా ఓ కట్టు కథని తెలుకొని సదరు యువతి ఖంగుతుంది.

వివరాల్లోకి వెళితే..గుంటూరులోని భారత్ పేటకు చెందిన ఓ యువతికి విజయవాడలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు నాయుడుపేటకు చెందిన భార్యా భర్తలు శైలజ, గణేష్. ఇందుకు రూ.4 లక్షలు తీసుకొని..అపాయిట్ మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. ఆమె దానిని తీసుకుని విజయవాడలోని సదరు సంస్థకు వెళ్లగా అది నకిలీదని తేలింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.