తెలంగాణాలో విషాదం నెలకొంది. ఒకేరోజు రెండు వేర్వేరు ప్రమాదాల్లో భార్యాభర్తలు దుర్మరణం పాలైన ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో చోటు చేసుకంది. అంతంపల్లికి చెందిన సిద్దయ్య తన బైక్ పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆయన భార్య సిద్దమ్మ, తమ్ముడు లింగం బైక్‌పై ఘటనాస్థలానికి వెళ్తుండగా కింద పడిపోవడంతో సిద్దమ్మ మృతి చెందింది. ఇద్దరి మృతితో ఆ కుటుంబాన్ని విషాధచాయలు అలముకున్నాయి.