వీరు మాములు భార్య భ‌ర్త‌లు కాదు ఏకంగా 19 హ‌త్య‌లు

Husband and wife together 19 murders

0
96

ఈ భార్య భ‌ర్తలు మాములు వాళ్లు కాదు ఏకంగా 19 మందిని హ‌త్య‌ చేశారు. బంగారం పై మోజుతో ఇలా మర్డ‌ర్లు చేస్తున్నారు. భార్య భ‌ర్త‌లు హ‌త్య‌లు చేయడంలో ఒకరినొకరు పోటీ పడినట్లు క‌నిపిస్తుంది.
బంగారం కోసం అమాయకుల‌ని నమ్మించి అడవుల్లోకి తీసుకెళ్లి హత్యలు చేస్తున్నారు. చివ‌ర‌కు వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌లోని దుండిగల్‌లో వరుస హత్యలు చేస్తున్న ఘరానా దంపతులని పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరు ఎవ‌రి ఒంటి మీద అయినా బంగారం క‌నిపిస్తే చాలు వారిని న‌మ్మిస్తారు. అంతేకాదు వారిని కూలీ ప‌నికి అని తీసుకువెళ్లి దారుణంగా చంపేసి బంగారం తీసుకుని పారిపోతారు.

ఈ దంపతులిద్దరు కలిసి 19 హత్యలు చేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. భర్త 8 మందిని పొట్టన పెట్టుకోగా భార్య ఏకంగా 11 మందిని హత్య చేసినట్టు గుర్తించారు.సంగారెడ్డి, జిన్నారం అడవుల్లోకి తీసుకెళ్లి హత్య చేసి, వారి నుంచి బంగారం దోపిడి చేసి పరారవుతున్నారు. తాజాగా పోలీసులు ఓ మిస్సింగ్‌ కేసు దర్యాప్తు చేస్తున్న స‌మ‌యంలో ఈ మర్డర్‌ హిస్టరీ బయటికి వచ్చింది.