భర్త ఫోన్ పై నిఘా పెట్టిన భార్య –  చివరకు ఆమెకి షాక్ ఇచ్చిన భర్త

0
155

భార్య భర్తల బంధం నిలబడాలి అంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి… ఆ నమ్మకం లేకపోతే ఆ బంధం ఎంతో కాలం నిలవదు… అయితే భర్తపై భార్యకు అనుమానం వచ్చినా, భార్యపై భర్తకు అనుమానం వచ్చినా నిత్యం ఆ ఇంట మనశ్శాంతి ఉండదు. ఏదో ఓ విషయంపై వివాదం నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.

అబుదాబికి చెందిన దంపతుల మధ్య పెళ్ళైన కొద్దిరోజులకే గొడవలు మొదలయ్యాయి. ఇక భర్త తీరులో మార్పు వచ్చింది. ఆమెకి అతనిపై అనుమానం మొదలైంది… ఇక ఫోన్లో ఏదో సీక్రెట్స్ ఉన్నాయని ఆమె అనుమానించింది, దీంతో అతని ఫోన్ పై నిఘా పెట్టింది.

అంతేకాకుండా అందులో ఉన్న ఫోటోలను తన భర్తకు తెలియకుండా వేరేవాళ్లకు పంపించింది. ఓరోజు భార్య చేసిన పనికి అతను షాక్ అయ్యాడు, దీనిపై కోర్టుకు వెళ్లాడు…భర్త వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినందుకు గానూ భార్యకు 5,400 దిరమ్ లను  అంటే లక్ష నష్ట పరిహారంగా చెల్లించాలి అని కోర్టు తెలిపింది.