భార్యకు హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చిన భ‌ర్త – ఎందుకింత దారుణం చేశాడంటే

Husband given HIV injection to his wife

0
91

కొంద‌రు ఎంత దారుణంగా ఉంటారంటే ఇలాంటి ఘ‌ట‌న‌లు వింటే షాక్ అవుతాం. ఇక్క‌డ జ‌రిగిన ఘ‌ట‌న ఒక్క‌సారిగా అంద‌రిని షాక్ కి గురి చేసింది. అంతేకాదు ఆ వ్య‌క్తికి ఉరిశిక్ష వేయాల్సిందే అంటున్నారు అంద‌రూ. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో మహేశ్ గౌతమ్ ల్యాబ్ టెక్నీషీయన్ గా పనిచేస్తున్నాడు.

2020లో మహేశ్ గౌతమ్ కు పెళ్లయింది. అయితే, అదే ఆసుపత్రిలో పనిచేసే మరో ఉద్యోగినితో మహేశ్ కు వివాహేతర సంబంధం ఉంది. ఈ విష‌యం భార్య‌కు తెలిసి అత‌నిని నిల‌దీసింది. కాని భార్య‌ని వ‌దిలించుకుని ప్రియురాలితో ఉండాలి అని అత‌ని కోరిక. దీంతో భార్య‌ని అడ్డు తొల‌గించుకోవాలి అని అనుకున్నాడు. విడాకులు కోరాడు ఇవ్వ‌ను అని చెప్పింది. ఇక ఆమె గ‌ర్భ‌వ‌తి దీంతో దారుణానికి ఒడిగ‌ట్టాడు.

ఓ హెచ్ఐవీ రోగికి చేసిన ఇంజెక్షన్ ను అలాగే తీసుకువచ్చి భార్యకు గుచ్చాడు. వెంట‌నే ఈ విష‌యం ఆమెకి తెలిసి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి అత‌నిపై పోలీసుల‌కి ఫిర్యాదు చేసింది. దీంతో అత‌నిపై కేసు న‌మోదు చేశారు. ఎంత దారుణం చేశాడు ఈ దుర్మార్గుడు.