కొత్తగా వివాహమైంది ఈ జంటకి. అయితే కొడుకు కుందన్ దిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు భార్యని తన ఇంటికి తీసుకువచ్చి తన సొంత ఇంట్లోనే ఉంచాడు భర్త. ఇక అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు. అయితే భార్య చెడు బుద్దితో ఏకంగా ప్రియుడిని అత్త వారి ఇంటికి పిలిపించింది. ఇంతకీ ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.
జార్ఖండ్ లోని గొడ్డా అనే ప్రాంతానికి చెందిన యువతికి కుందన్ అనే యువకుడితో వివాహం జరిగింది.
ఆయువతికి పెళ్లికి ముందే మరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. భర్త ఎలాగూ లేడు కదా అని ప్రియుడితో రాసలీలకు స్కెచ్ వేసింది. మా బాబాయ్ వరస అవుతాడు అని ప్రియుడిని అత్తవారి ఇంటికి పిలిచింది. రాత్రిపూట అతడిని తన గదిలోనే పడుకోమని చెప్పి రాసలీలలు సాగించేది.
ఇలా 10 రోజుల పాటు అత్తమామల కళ్లుగప్పి అతడితో వ్యవహారం నడిపింది. ఇక తర్వాత ఆ వ్యక్తి పని ఉందని వెళ్లిపోయాడు. బంధువుల పేర్లు అడిగితే తడబడ్డాడు. దీంతో ఆమె మామకి అనుమానం వచ్చింది. మరోసారి వస్తాడు కదా అని ఎదురుచూశాడు. మామ అనుకున్నట్లే వారానికి మళ్లీ వచ్చాడు ఆమె ప్రియుడు.వెంటనే కుందన్ తండ్రి స్థానికుల సాయంతో అతడిని పట్టుకుని కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదాడు. చివరకు విడాకులు ఇచ్చేందుకు కుందన్ సిద్దమయ్యాడు. భార్యపై ప్రియుడిపై కేసు నమోదు చేశారు కుందన్ కుటుంబం.