భర్త పండగకు రానన్నాడని మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లాలోని ఆమనగల్లు మేడిగడ్డకి చెందిన వడ్త్యావత్ మౌనికకు అదే గ్రామానికి చెందిన మేనమామ కుమారుడు అనిల్‌తో ఆరు నెలల కిందట వివాహం జరిగింది. అనిల్ డీసీఎం డ్రైవర్. దసరా పండగకు ఊరికి రావాలని భార్య మౌనిక భర్తకు ఫోన్ చేసింది. పని ఉందని వెంటనే రావడానికి వీలు కాదని చెప్పడంతో మనస్తాపానికి గురైంది.
దీనితో పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ధర్మేశ్ తెలిపారు. పండుగ పూట జరిగిన విషాదంతో ఇరు కుటుంబాలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయాయి.