ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథి జిల్లాలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట మధ్య విభేదాలు రావడంతో విడాకుల కోసం అప్లై చేశారు. ముఖ్యంగా భార్య అతనితో ఉండను అని కోర్టుకు వెళ్లింది. తనపై భార్య ఫిర్యాదు చేయడంతో రగిలిపోయాడు భర్త. తన స్నేహితులు ముగ్గుర్ని వెంటబెట్టుకుని వెళ్లి దారుణం చేశాడు.
ఆమె భర్త ఈ నెల 24న తన ముగ్గురు స్నేహితులను వెంటబెట్టుకుని భార్య వుంటున్న ఇంటికి వెళ్లాడు. ఆమె ఇంట్లో ఒక్కర్తే ఉంది ముగ్గురు కలిసి ఆమెపై దాడి చేశారు. ముందుగా తన స్నేహితుడి చేత అత్యాచారం చేయించాడు. ఇలా రాక్షసంగా ప్రవర్తించి చివరకు ఆమెకి నరకం చూపించారు. ఆమెపై పెట్రోల్ పోసి తగలపెట్టేందుకు ప్రయత్నించారు. చివరకు ఆమె గట్టిగా కేకలు వేసింది. ఇరుగు పొరుగు వారు వస్తారు అని భయపడి అక్కడ నుంచి పారిపోయారు.
వెంటనే ఆమె స్ధానికుల సాయంతో పోలీసుల దగ్గరకు వెళ్లింది. భర్త అతని స్నేహితులపై ఫిర్యాదు చేసింది .వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంత దారుణం జరగడంతో స్ధానికులు షాక్ అయ్యారు.