Flash- పేకాటరాయుళ్ల అరెస్ట్..అందులో ప్రజాప్రతినిధులు కూడా..

Husbands of corporators playing poker .. Police caught red handed

0
90

వాళ్లంతా కార్పొరేటర్ల భర్తలు. ఎంతో హుందాగా నడుచుకోల్సింది పోయి. పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్‌ పరిధిలోని యాద్గార్‌పల్లిలో ఉన్న ఓ రిసార్ట్‌లో పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు దాడులు నిర్వహించారు.

ఏడుగురు పేకాట ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. పట్టుబడిన వారిలో ముగ్గురు కార్పొరేటర్ల భర్తల కూడా ఉండడం కలకలం రేపుతోంది. పేకాటపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ పేకాట రాయుళ్లు మాత్రం యథేచ్ఛగా ఆడుతున్నారు.

హజ్

|| *బిగ్ బ్రేకింగ్ న్యూస్* ||

● *ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధుల భర్తలు అడ్డదారిలో జెల్సాలకు అలవాటు పడి పేకాట ఆడుతూ SOT పోలీసుల రైడింగ్ లో దొరికి పోయి పరువు పోగొట్టుకొన్న వైనం*……!

మేడ్చల్ జిల్లా కీసర పోలిస్ స్టేషన్ పరిధిలోని ఓ రిసార్ట్ లో వీరంతా పేకాట ఆడుతున్నారు.3వ డివిజన్ కార్పొరేటర్ భర్త బల్లి శ్రీనివాస్ అలియాస్ రేషన్ షాప్ డీలర్ , నాల్గవ డివిజన్ కార్పొరేటర్ భర్త మరగొని వెంకటేష్ అలాగే 9వ డివిజన్ కార్పొరేటర్ భర్త మనోదర్ రెడ్డి తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి కీసర పోలిస్ స్టేషన్ కి ఎస్ ఓటి పోలీసులు తరలించారు.